రైతులు, అసంఘటిత వర్గాలకు పార్టీ బాసట

హైదరాబాద్ :

రాష్ట్ర విభజన నేపథ్యంలో దిక్కుతోచని స్థితిలో పడి కొట్టుమిట్టాడుతున్న  రైతులు, అసంఘటిత రంగంలోని వర్గాలకు బాసటగా నిలవాల్సిన బాధ్యత‌ ప్రజాపక్షంగా వైయస్ఆర్ కాంగ్రెస్‌కు ఉందని పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్‌ విజయమ్మ అన్నారు. కనుక వారి తరఫున తాము పోరాడుతున్నామన్నారు. సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు శుక్రవారం శ్రీమతి విజయమ్మను లోటస్‌పాండ్‌లోని నివాసంలో కలిశారు. ఈ నెల 27న ఢిల్లీలో తాము నిర్వహించనున్న మహాధర్నాలో పార్టీ నేతలతో సహా పాల్గొనాలని ఉద్యోగులు ఆమెను కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన శ్రీమతి విజయమ్మ మాట్లాడారు. రాష్ట్ర విభజనతో రాయలసీమ ఎడారిగా మారే ప్రమాదం ఉందని, సీమ ప్రజలకు తాగునీరు కూడా అందక అల్లాడుతారని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. విభజన పర్యవసానాలపై అవగాహన ఉన్న ఉద్యోగులు కేంద్ర నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాట చేయడం హర్షణీయం అని శ్రీమతి విజయమ్మ ప్రశంసించారు.

తాజా వీడియోలు

Back to Top