

















విశాఖపట్నం: గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమానికి అనుమతివ్వాలని నర్సీపట్నం వైయస్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ పెట్ల ఉమా శంకర్ గణేష్ సబ్ కలెక్టర్‌ను కోరారు. శుక్రవారం ఆయన సబ్ కలెక్టర్ కలిశారు. నర్సీపట్నం టౌన్ లో గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమం నిర్వహించేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌కు ఎలాంటి సంబంధం ఉండదని ఆయన సబ్ కలెక్టర్‌కు వివరించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన సాకు చూపి ఇలాంటి కార్యక్రమాలకు అవరోదం కలిగించొద్దని ఆయన కోరారు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు గడప గడపకూ వైయస్ఆర్ కార్యక్రమాన్ని గతేడాది జూలై 8వ తేదీ నుంచి చేపడుతున్నామని ఉమా శంకర్ గణేష్ సబ్ కలెక్టర్‌కు వివరించారు.