ఈబీసీలకు బడ్జెట్ ఇచ్చింది వైయస్‌ రాజశేఖరరెడ్డి

హైదరాబాద్‌, 3 సెప్టెంబర్‌ 2012 : ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈబీసీ)కు తొలిసారిగా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిన దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారని ఈబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్‌రెడ్డి ‌కొనియాడారు. ఈబీసీ సంఘం రాష్ట్ర కార్యాలయంలో ఆదివారంనాడు వైయస్‌ఆర్ మూ‌డవ వర్ధంతిని నిర్వహించారు. వైయస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈబీసీ విద్యార్థుల ఉన్నత చదువుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేసిన ఘనత వై‌యస్‌దే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఈబీసీ నాయకులు పాల్గొన్నారు.

Back to Top