దుల్హాన్‌ పథకం కాలపరిమితి పెంచాలి

ఏపీ అసెంబ్లీ:  దుల్హాన్‌ పథకం కాలపరిమితి పెంచాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో దుల్హాన్‌ పథకంపై ఆయన మాట్లాడారు. దుల్హాన్‌ పథకం కింద ఈ ఏడాది 13700 దరఖాస్తులు వస్తే 6700 మాత్రమే పరిష్కరించారని అన్నారు. ఆర్థిక సంవత్సరంలోనే వచ్చిన దరఖాస్తులు పరిశీలిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. 2015–2016లో ఈ పథకం నిధులు రూ.3 కోట్లు మిగిలిపోయాయని తెలిపారు. దాదాపు 60 శాతం దరఖాస్తులు పరిస్కారం కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు కాలపరిమితి పెళ్ళైన ఆరు నెలల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండేదన్నారు.  ఆ పరిమితిని 2 నెలలకు కుదించారని అభ్యంతరం వ్యక్తం చేశారు. కుటుంబ ఆదాయం లక్ష లోపు ఉండాలని చెప్పారు. ఇదే పథకం తెలంగాణలో రూ.2 లక్షల వరకు ఉంది. దీన్ని రెండు లక్షలకు పెంచాలని, ఈ పథకం ద్వారా వధువు పేరుతో డిపాజిట్‌ చేస్తున్నారని, అలా కాకుండా తల్లిదండ్రుల పేరుతో డిపాజిట్‌ చేస్తే బాగుంటుందన్నారు. జీరో అకౌంట్, డ్వాక్రా అకౌంట్లు కావాలని నిబంధనలు పెట్టారు. ఇది సరికాదన్నారు.

Back to Top