పెద్దాడలో మహానేత వైయస్ విగ్రహావిష్కరణ

పెద్దాడ (తూ.గో.జిల్లా),

12 జూన్‌ 2013: శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో అప్రతిహతంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా శ్రీమతి షర్మిల బుధవారంనాడు జిల్లాలోని పెద్దాడలో మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జనహృదయ నేత వై‌యస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.

‌ప్రజా సమస్యలను పట్టించుకోకుండా కుట్రలు, కుమ్మక్కులతో కాలం గడుపుతున్న అధికార కాంగ్రెస్ పార్టీ,‌ దానికి రక్షణ కవచంలా నిలుస్తున్న ప్రధాన ప్రతిపక్షం టిడిపి తీరుకు నిరసనగా వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతున్న పాదయాత్రలో మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని మద్దతుగా నిలుస్తున్నారు.

Back to Top