దోషులను వదిలి బాధిత రైతుపై బరితెగింపు...!

పంట తగలబడినట్లు ఒప్పుకోవాలంటూ దౌర్జన్యం..!
మూడు రోజులుగా స్టేషన్ లో ఉంచి వేధింపులు..!

గుంటూరు: రాజధాని ప్రాంతంలో పచ్చసర్కార్ ఆగడాలకు హద్దే లేకుండా పోయింది.  అమరావతి నిర్మాణానికి భూములు ఇవ్వని తుళ్లూరు మండలం మల్కాపురం రైతు గద్దే చంద్రశేఖర్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. చేతికొచ్చిన ఐదు ఎకరాల చెరకు పంటను అన్యాయంగా కాల్చి బూడిద చేయడమే గాకుండా స్టేషన్ కు పిలిపించి వేధింపులకు గురిచేస్తోంది. పోలీసులు, ప్రభుత్వం తీరుపై ప్రతిపక్ష పార్టీలు  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.  

బాధిత రైతును దోషిగా చూపించేందుకు పోలీసులు, ప్రభుత్వం కుట్ర పన్నుతున్నారు. గత మూడు రోజులుగా చంద్రశేఖర్ ను అదుపులో ఉంచుకున్న ఖాకీలు కావరం ప్రదర్శిస్తున్నారు. తమ పంటకు తామే నిప్పుపెట్టుకున్నట్టుగా ఒప్పుకోవాలంటూ చంద్రశేఖర్ ను బెదిరిస్తున్నారు. పంట తగలబెట్టిన అసలు నిందితులను పట్టుకోకుండా...బాధిత రైతును స్టేషన్ లో ఉంచి దౌర్జన్యం చేస్తున్నారంటే ఎంతగా దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థమవుతోంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల మల్కాపురంలో పర్యటించి కాలిపోయిన చంద్రశేఖర్ చెరకుతోటను పరిశీలించారు. వైఎస్ జగన్ అక్కడి నుంచి వెళ్లాక బాధిత రైతుపై వేధింపులు మొదలయ్యాయి.
Back to Top