విద్యుత్‌ లేని గ్రామాలు ప్రభుత్వానికి తెలుసా?

ఏపీ అసెంబ్లీః విద్యుత్‌ లేని గ్రామాలు లేవని మంత్రి చెబుతున్నారంటే అసలు ఈ ప్రభుత్వానికి విద్యుత్‌ లేని గ్రామాలు తెలుసా అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె  మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో విద్యుత్‌ ఉందని మంత్రి అంటున్నారు. ఈ రోజు గిరిజన మారుమూల గ్రా మాల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. నా నియోజకవర్గంలో 1476 గ్రామాలు ఉన్నాయి. మా గ్రామాల్లో కరెంటు లేని విషయం మీ దృష్టికి వచ్చిందా? అలాగే కరెంటు బిల్లులు వచ్చేలోగా 50 యూనిట్లు ఉచితం అంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటంటే కొండ ప్రాంతానికి వెళ్లకుండా ఏదో ఒక చెట్టుకింద కూర్చోని మీటర్‌ కూడా చూడకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి.
Back to Top