పార్టీ బలోపేతం కోసం పాటుపడాలి

పెద్దతిప్పసముద్రం:తంబళ్ళపల్లి నియోజకవర్గ వైయస్సార్‌సీపీ సమన్వయకర్త పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి బుధవారం మండలంలోని కాట్నగల్లు గ్రామంలో నూతనంగా వెలసిన నాగమ్మ దేవి ఆలయంలో పూజలందుకున్నారు. గ్రామస్థులు, భక్తులు ద్వారకనాథ్‌రెడ్డికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ భక్తి శ్రద్దలతో ఆయనచే పూజలు చేయించారు. ఆలయ నిర్మాణం కోసం ద్వారకనాథ్‌రెడ్డి తన సొంత నిధులతో ఇటీవల కొంత నగదును విరాళంగా అందజేసిన సందర్బంగా గ్రామస్థులు ఆయనను విగ్రహ ప్రతిష్టా కార్యక్రమానికి ఆహ్వానించారు. అనంతరం గ్రామస్థులతో ఆయన మమేకమయ్యారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి దయ వల్ల మాకు పక్కా గృహాలు మంజూరయ్యాయని, ఆరోగ్యశ్రీ ద్వారా తమ ఆరోగ్యం కుదుట పడిందని, ఆయన ప్రవేశ పెట్టిన స్కాలర్‌షిప్‌ల కారణంగా తమ పిల్లల చదువుకు ఆసరాగా నిలిచిందని పలువురు దివంగత నేతను స్మరించుకుంటూ ప్రసంగించారు. 

ఆయన తనయుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైయస్సార్‌సీపీకి తామంతా అండగా నిలిచి వైయస్‌ఆర్‌ రుణం తీర్చుకుంటామని ప్రజలు స్పష్టం చేసారు. టిడిపి ప్రభుత్వంలో ఒక్క పక్కా గృహం మంజూరు కావాలన్నా కష్టమేనన్నారు. ద్వారకనాథ్‌రెడ్డి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ...రాజశేఖర్‌రెడ్డి గతంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మళ్ళీ రాజన్న రాజ్యం రావాలన్నా, అర్హులైన వారికి పథకాలు దరి చేరాలన్నా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే సాధ్యమన్నారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేసేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఆయన కోరారు. ఆయన వెంట స్థానిక నాయకులు వెంకటరెడ్డి, సందీప్‌రెడ్డి, విశ్వనాథ్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, బుజ్జీ, శివారెడ్డి, నాగరాజు, పెద్దిగోళ్ళ కుటుంబ సభ్యులు, మండల కన్వీనర్‌ సుబ్బరాంతో పాటు ఉంగరాల శివన్న, కొట్టి మల్లికార్జున, రియాసత్‌ అలీఖాన్, మహమూద్, టైలర్‌ బావాజాన్, శ్రీనివాసులు, వెంకట్రమణారెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.   

Back to Top