డిపాజిట్లు దక్కవనే ‘స్థానిక’ ఎన్నికలకు కాంగ్రెస్ దూరం: కాపు

గుమ్మఘట్ట: కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా దక్కవనే భయంతోనే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి పెద్ద శని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే అని, ఇలాంటి అసమర్థ సీఎంను ఎక్కడా చూడలేదని ధ్వజమెత్తారు.  గలగల గ్రామంలో పల్లెనిద్ర చేశారు.  ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సమస్యలు తెలుసుకునేందుకు గ్రామవీధుల్లో పర్యటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి మాత్రం కుర్చీని కాపాడుకునేందుకు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు. గ్యాస్, డీజిల్‌తో పాటు నిత్యావసర సరుకుల ధరలు తరచూ పెంచుతూ పేదల నడ్డి విరుస్తున్న కాంగ్రెస్ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. వైయస్ పాలన  జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమన్నారు. ఆయన త్వరలోనే జనం మధ్యకు వస్తారన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్‌ సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మహేష్, నాయకులు గోనబావి సర్మస్, పూలకుంట రాజశేఖరరెడ్డి, రామకృష్ణారెడ్డి, కలుగోడు ధనుంజయ, ఈడిగ శ్రీనివాసులు, మాజీ సర్పంచ్ చన్మల్లగౌడ్, గొల్లపల్లి కాంతారెడ్డి, తాళ్లకెర వీరభద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు

తాజా వీడియోలు

Back to Top