'డి.కె. అరుణ రాజకీయ దివాళాకోరు'

హైదరాబాద్, 15 ఏప్రిల్ ‌2013: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంపై మంత్రి డి.కె. అరుణ వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనానికి నిదర్శనమని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ గోనె ప్రకాశరావు నిప్పులు చెరిగారు. ఎన్నో పార్టీలు మారిన అరుణ చివరికి కాంగ్రెస్‌లో చేరారని ఆయన అన్నారు. టిడిపి తరఫున పోటీ చేసి ఓడిపోయిన డి.కె. అరుణకు కాంగ్రెస్ టికె‌ట్ ఇచ్చి‌, మంత్రిని చేసింది మహానేత వైయస్ రాజశేఖరరె‌డ్డి అన్న విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. తొండ ముదిరి ఊసరవెల్లి అయిందన్న చందంగా అరుణ రంగులు మారుస్తున్నారన్నారు. డి.కె. అరుణ కుటుంబం చీకటి బతుకులు, చీకటి వ్యాపారాలు త్వరలోనే బట్టబయలు అవుతాయని గోనె హెచ్చరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాకపోతే కాంగ్రెస్‌ పార్టీ బతికి బట్టకట్టదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గతంలో అన్న విషయాన్ని గోనె గుర్తుచేశారు.
Back to Top