ధర్మవరం సభకు హాజరు కానున్న విజయమ్మ

అనంతపురం, 25 అక్టోబర్‌ 2012: మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం తొమ్మిదవ రోజు మధ్యాహ్నం ధర్మవరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ తెలిపాయి. ఈ సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజ‌రై, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వైయస్ఆ‌ర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డికి బదులుగా ఆయన సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వలరకూ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ బహిరంగ సభలో విజయమ్మతో పాటు, మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నషర్మిల, మరి కొందరు పార్టీ నాయకులు కూడా మాట్లాడతారని వారు వివరించారు.

తాజా వీడియోలు

Back to Top