హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.<br/>