మృతుల కుటుంబాలకు ధర్మాన పరామర్శ

గార: 
      అంపోలు పంచాయితీ అంబటి ఎరుకువానిపేట గ్రామానికి చెందిన సీహెచ్‌ శిమ్మమ్మ ఇటీవల మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి, రాష్ట్ర వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పరామర్శించారు. అధేవిదంగా లింగాలవలస గ్రామానికి చెందిన సీనియర్‌ వైయస్సార్‌సీపీ నాయకుడు శీర అప్పలసూరి, కొమరవానిపేట గ్రామానికి చెందిన పేర్ల లక్ష్మయ్య, వమరవల్లి గ్రామానికి చెందిన  పొందరి మల్లేసు, పోలాకి అప్పన్న మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడ ఆయన పరామర్శించారు. ఆయన వెంట జిల్లా రైతు విభాగం అధ్యక్షులు గొండు రఘురాం, మండల పార్టీ కన్వీనర్‌ పీస శ్రీహరిరావు, సుగ్గు లక్ష్మీనర సింహాదేవి,  యాళ్ల నారాయణమూర్తి, గంగు రామారావు, సాధు లక్ష్మణ తదితరులు ఉన్నారు.
Back to Top