విశాఖపట్నం: నిరవధిక దీక్షలో ఉన్న వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్ నాథ్ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది. ప్రత్యేక రైల్వే జోన్ కోసం పార్టీ తరపున ఆయన దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైద్యులు ఆయన ఆరోగ్యాన్ని పరీక్షించి వెళ్లారు. రక్తపోటు, షుగర్ లెవల్స్ ను చెక్ చేశారు. అనేక మంది ప్రజా సంఘాల నాయకులు వైఎస్సార్సీపీ నేతలు దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ప్రత్యేక రైల్వే జోన్ కోసం జరుగుతున్న ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అనేక వర్గాల నుంచి మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రత్యేక విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అన్ని వర్గాలు సంఘీభావం తెలుపుతున్నాయి.