<strong>దామరచర్ల (నల్గొండ జిల్లా),</strong> 19 ఫిబ్రవరి 2013: మహానేత రాజన్న తనయ, జననేత జగనన్న సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 71వ రోజు మంగళవారం నల్గొండ జిల్లా దామరచర్ల శివారు నుంచి ప్రారంభించారు. వేలాది మంది వైయస్ అభిమానులు, పార్టీ శ్రేణులు శ్రీమతి షర్మిల వెంట కదిలి నడుస్తున్నారు. మంగళవారంనాడు శ్రీమతి షర్మిల దామరచర్ల, వీరభద్రాపురం, లారీయార్డు, వాడపల్లి గ్రామాలలో పాదయాత్ర నిర్వహిస్తారు. శ్రీమతి షర్మిల ఈ రోజు మొత్తం 8.5 కిలో మీటర్లు పాదయాత్ర చేస్తారు. <br/>