విజయనగరం: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ఆకర్శితులై, ఆయన ప్రకటించిన నవరత్నాలతో అందరికీ మేలు జరుగుతుందని నమ్మి వైయస్‌ఆర్‌సీపీలోకి క్యూ కడుతున్నారు. నిన్న వైయస్ జగన్ సమక్షంలో రాజమండ్రికి చెందిన బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, మార్గాని భరత్‌లతో పాటు ఆయా సంఘాల ముఖ్య నేతలు వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రజా సంకల్ప యాత్ర 296వ రోజు సీ.రామచంద్రయ్య వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్– టీడీపీ పొత్తను వ్యతిరేకించిన రామచంద్రయ్య ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.