ఎకరాకు రూ.25 వేల పరిహారం ఇవ్వాలి

పెండ్లిమర్రి: అకాల
వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25వేల పరిహారం ఇవ్వాలని
కమలాపురం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ప్రభుత్వాన్ని
డిమాండ్ చేశారు. వైఎస్సార్ జిల్లా పెండ్లిమర్రి మండలంలో వర్షాలకు
దెబ్బతిన్న పంటలను  ఆయన పరిశీలించారు. పెండ్లిమర్రి, ఎగువపల్లె,
మొయిళ్లకాల్వ గ్రామాల్లోని శనగ, చామంతి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా
రైతులు తమ కష్టాలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. 

తాజా ఫోటోలు

Back to Top