వైయస్ఆర్ కాంగ్రెస్‌లోకి కాంగ్రెస్, టీడీపీ నేతలు

హైదరాబాద్  16 ఆగస్టు 2013:

చిత్తూరు జిల్లాలో కాంగ్రెస్‌, టీడీపీ పార్టీలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ సమక్షంలో  వీరు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరుకు చెందిన పలువురు కాంగ్రెస్‌, టీడీపీ మాజీ కౌన్సిలర్లు, స్థానిక నేతలు శుక్రవారం పార్టీలో చేరారు.  దాదాపు 100 మంది స్థానిక నేతలు పార్టీలో చేరారు.  వీరంతా బీసీల్లో వన్నెకుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారు.  జిల్లాలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్నప్పటికీ తమ కులానికి ఇప్పటివరకు రాజకీయ ప్రాధాన్యత లేకపోవడంతో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలని  నిర్ణయించుకున్నట్లు చెప్పారు. బీసీలకు తమ పార్టీ కచ్చితంగా న్యాయం చేస్తుందని శ్రీమతి వైయస్ విజయమ్మ వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top