పార్టీ నాయకునికి పరామర్శ

నెల్లూరు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీఈసీ సభ్యులు పాపకన్ను రాజశేఖరరెడ్డి
తల్లి పెద్ద చిన్నమ్మ (95)
మృతికి వైయస్‌ఆర్‌సీపీ
నాయకులు,
మేకపాటి కుటుంబ
సభ్యులు సంతాపం తెలిపారు. మరణించిన చిన్నమ్మ పార్టీ అగ్రనేత మేకపాటి రాజమోహన్
రెడ్డి కుటుంబానికి సన్నిహిత బంధువు. ఆమె  అనారోగ్యంతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు. ఆమె
అంత్య క్రియలు మంగళవారం రాపూరు మండలం వేపినాపి గ్రామంలో నిర్వహించారు. చిన్నమ్మ
భౌతికకాయాన్ని  ఆమె అల్లుడు, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, మనుమడు ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, మేకపాటి ప్రదీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, మేకపాటి రాజగోపాల్‌రెడ్డి, చంద్రమౌళీశ్వరరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ,సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధనరెడ్డి, నెల్లూరు రూరల్‌ శాసనసభ్యులు కోటంరెడ్డి
శ్రీధర్‌రెడ్డి,
సూళ్లూరుపేట
శాసనసభ్యులు కలివేటి సంజీవయ్య, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, నాయకులు మురళీధర్, బండి కృష్ణారెడ్డి, తదితరులు సందర్శించారు. చిన్నమ్మ మృతదేహానికి
పూలమాల వేసి శ్రద్ధాంజలి కట్టించారు.   

 

Back to Top