మార్కాపురం పీఎస్ లో బాబుపై ఫిర్యాదు

ఒంగోలు : ప్రకాశం జిల్లా మార్కాపురం పోలీస్ స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. చంద్రబాబు  మోసపూరిత పాలనపై రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కేసులు నమోదు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు ఉదయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా మార్కాపురం పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. దీన్ని అడ్డుకునేందుకు పచ్చ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  పోలీసులు జోక్యం చేసుకుని టీడీపీ వారిని అక్కడ నుంచి పంపివేశారు. అనంతరం వైయస్ఆర్ సీపీ నాయకులు ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేశారు.  

 

Back to Top