కేసుల భయంతో పారిపోయిన ముఖ్యమంత్రి

ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ స్థాయిని మరచి మాట్లాడుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ నేత కావటి శివనాగ మనోహరనాయుడు మండిపడ్డారు. ప్రతిపక్ష నేత జగన్‌మోహనరెడ్డి ప్రధాని నరేంద్రమోడిని కలసి రాష్ట్ర సమస్యలను, ప్రత్యేక హదా ఆవశ్యకతను, టీడీపీ ప్రజావ్యతిరేక విధానాలను వివరిస్తే తప్పేముందని, స్థాయి ఏందో తెలుసుకోవాలని మాట్లాడాలని కొమ్మాలపాటిని హెచ్చరించారు. టీడీపీ అవినీతి పాలన, ప్రత్యేక హోదా, ఏమీ తెలియని ఒక పప్పుకు మంత్రిపదవి కట్టబెట్టిన వైనాన్ని వివరించేందుకు వైయస్ జగన్ ఢిల్లీ వెళ్లారన్నారు. చంద్రబాబుపై 13కేసులు ఉంటే అవి విచారణ జరగకుండా కోర్టు నుండి స్టే తెచ్చుకోలేదా అని ప్రశ్నించారు. దేశంలోనే అవినీతిలో నెంబరు వన్‌ తానేనని చంద్రబాబు ఒప్పుకోలేదా అని అన్నారు. 10సంవత్సరాలపాటు ఉమ్మడి రాజధానిగా హైద్రాబాద్‌పై పూర్తి హక్కులున్నా, నోటుకు ఓటు కేసులో కేసిఆర్‌ నుండి తప్పించుకునేందుకు భయపడి పారిపోయి రాలేదా, కేంద్రం వద్దకు పోయి ప్రధాని కాళ్లమీద పడింది మీ చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో మండల పార్టీ కన్వినర్‌ సందెపోగు సత్యం, జిల్లా పార్టీ కార్యదర్శి మంగిశెట్టి కోటేశ్వరరావు, బెల్లంకొండి ఎంపీపీ మర్రి పద్మా వెంకటేశ్వరరెడ్డి, మార్కెట్‌యార్డు మాజీ డైరెక్టర్‌ అంబటి నారాయణ, మాజీ సర్పంచ్‌ చిన్నపరెడ్డి, పట్టణపార్టీ కన్వినర్‌ షేక్‌ మౌలాలి, సేవాదళ్‌ కన్వినర్‌ అనంతరామయ్య, పట్టయూత్‌ కన్వినర్‌ చల్లా శ్రీకాంత్, ఉప్పు సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top