కర్నూలు: దివంగత నేత చెరుకులపాడు నారాయణరెడ్డికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం జననేత కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చెరుకులపాడు గ్రామానికి చేరుకున్న వైయస్ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత నేత నారాయణరెడ్డి సమాది వద్దకు చేరుకుని పూలమాల వేసి నివాళులర్పించారు. నారాయణరెడ్డి సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబానికి అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు వైయస్ జగన్ సూచించారు.