చేనేతకు రాజన్న చేయూత: డాక్టర్ తిప్పారెడ్డి

మదనపల్లె:

మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి పాలనలోనే చేనేత రంగానికి చేయూతనిచ్చారని ఎమ్మెల్సీ డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి చెప్పారు. స్థానిక నీరుగట్టువారిపల్లెలో చేనేత కార్మికుల సమావేశాన్ని నిర్వహించారు. మహానేత పాలనలో చేనేత రంగాన్ని ఆదుకోవడానికి కార్మికులకు రాయితీపై జరీ, ముడి సరుకులు అందశామనీ,  రుణ మాఫీ, పావలావడ్డీల రుణాలు అందజేశామని గుర్తుచేశారు. మహానేత మరణాంతరం చేనేత రంగం సంక్షోభంలో పడి ఆదుకునే నాథుడు కరయ్యారన్నారు. చేనేత కార్మికులకు ఆరోగ్యశ్రీ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు అందించిన ఘనత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు.

వైయస్ఆర్ సీపీ చేనేత ఐక్యవేదిక కమిటీ ఏర్పాటు
వైఎస్సార్ సీపీ చేనేత ఐక్యవేదిక కమిటీ అధ్యక్షుడిగా బి.సుబ్రమణ్యం, గౌరవాధ్యక్షుడిగా శంకర్‌నారాయణ, ఉపాధ్యక్షుడిగా మునీంద్ర, కార్యదర్శులుగా నల్లచెరువు బాషా, ప్రసాద్, సాంబశివ, కృష్ణమూర్తి ఎన్నికయ్యారు.

తాజా వీడియోలు

Back to Top