పోలవరంపై కేంద్రం చివాట్లు పెట్టినా మారని ప్రభుత్వ తీరు..!

పట్టిసీమ పేరుతో అంతా దగా..!
టెండర్లలో గోల్ మాల్..అనునూయులకే కాంట్రాక్ట్..!

కరువు,ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ఎక్కడైనా వేర్వేరుగా ఉంటాయా..?
పోలవరం, పట్టిసీమ విషయంలో ప్రభుత్వం మొండి వైఖరి అవలంభిస్తోంది. ప్రతిపక్షం అరిచిగీపెట్టినా, ప్రభుత్వానికి చివాట్లు పెడుతూ కేంద్రం లేఖరాసినా బుద్ధి మారడం లేదు.  ఇదే  అంశాన్ని ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో లేవనెత్తితో కరువు, ఇరిగేషన్ వేర్వేరని మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో 1500 అడుగులు వేస్తే బోరు పడని పరిస్థితి ఉందని వైఎస్ జగన్ సభలో ఉద్ఘాటించారు.  కరువుపై చర్చజరగనీయరు. 25 నిమిషాలు మాట్లాడితే గంటకుపైగా అవరోధం కల్పిస్తారు. ఇదెక్కడి దారుణమని అసెంబ్లీ కమిటీ హాల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

చివాట్లు పెట్టినా మారని తీరు..!
పోలవరం ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయని స్వయంగా ఆప్రాజెక్ట్ అథారిటీ సీఈవో దినేష్ కుమార్ ప్రభుత్వానికి చివాట్లు పెడుతూ లేఖ రాసినా ప్రభుత్వానికి పట్టడం లేదని జగన్ అన్నారు.  ప్రాజెక్ట్ పనులు పూర్తి చేసే చిత్తశుద్ధి కాంట్రాక్ట్ సంస్థకు లేదని కేంద్రం లేఖరాస్తే...కాంట్రాక్టర్ అన్యాయస్తుడు అని తెలిసి కూడా చంద్రబాబు కమీషన్ తీసుకొని 290 కోట్ల రూపాయల మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. వీటి గురించి  నిలదీస్తే సభలో మాట్లాడవద్దంటారు. ఇదెక్కడి  న్యాయమని వైెఎస్ జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.  

దోచుకునేందుకే పట్టిసీమ...ప్రాజెక్ట్ కు మేం వ్యతిరేకం..!
పట్టిసీమపై మాస్టాండ్ చెప్పాం. గత అసెంబ్లీలో రెండు రోజులు సవివరంగా తెలియజేశాం. కానీ చంద్రబాబు తాను సభలో లేనప్పుడు పట్టిసీమపై వెటకారంగా మాట్లాడారని జగన్ అన్నారు. పట్టిసీమలో నీటి స్టోరేజీకి అవకాశం లేదు. దానికి పెట్టే ఖర్చంతా వృథా. ఇదే డబ్బును హంద్రీనీవా, గాలేరు-నగరిలోనో  లేక పులిచింతల, వెలిగోడు ప్రాజెక్టుల్లో పెట్టినా అవి పూర్తవుతాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. పట్టిసీమకు తమ పార్టీ పూర్తిగా వ్యతిరేకమని మరోసారి ప్రభుత్వానికి తేల్చిచెప్పారు.

టెండర్లలో గోల్ మాల్..అనునూయులకే కాంట్రాక్ట్..!
టెండర్లలో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగింది. రాష్ట్రంలో, దేశంలో కాంట్రాక్టర్లెవరూ లేరన్నట్లు ప్రభుత్వం  వ్యవహరించింది. సంవత్సరంలోనే ప్రాజెక్ట్ లు పూర్తిచేయాలని చెప్పి ఇద్దరంటే ఇద్దరినే టెండర్లకు పిలిపించారు. 16.9 శాతం బోనస్ ఇచ్చారు. ఏడాదిలో పూర్తిచేసే ప్రాజెక్ట్ కు బోనస్ ఎందుకు ఇచ్చినట్లని వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. 30 పంపులు, 15 పైపులైన్లు ఉంటే వాటినీ తగ్గించారు. స్టీల్, అల్యుమినియం ధరలు తగ్గినా ..డిజైన్లు మార్చడం వల్ల రేటు పెరిగిందని కాంట్రాక్టర్ చెప్పడం ..చంద్రబాబు అనుమతించడం అంతా దోచుకోవడానికేనని జగన్  ధ్వజమెత్తారు. 
Back to Top