వైయస్‌ జగన్‌పై సీఎం వ్యక్తిగత దూషణలు

ఏపీ అసెంబ్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగారు. గురువారం పేపర్‌ లీకేజీపై సభలో జరిగిన చర్చలో చంద్రబాబు ప్రతిపక్ష నేతపై అన్‌పార్లమెంటరీ వ్యాఖ్యలు చేశారు. మంత్రులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, పేపర్‌ లీక్‌సమాచారం ఇచ్చిన సాక్షి మీడియాపై సీఎం  అక్కస్సు వెళ్లగక్కారు. వైయస్‌ జగన్‌ ప్రశ్నలకు నేరుగా సమాధానం చెప్పకుండా చంద్రబాబు వ్యక్తిగత దూషణలకు దిగడంతో సభలో గందరగోళం నెలకొంది.

Back to Top