మాదిగలను నమ్మించి మోసం చేశాడు

అనంతపురం: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మాదిగ జాతిని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి.. తప్పారని విమర్శించారు. వైఎస్సార్సీపీ , ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ  జనవరి 11వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్-లో యుద్ధభేరి యాత్ర నిర్వహిస్తామన్నారు. మార్చి 12వ తేదీన విజయవాడలో విశ్వరూప మహాసభ నిర్వహిస్తామన్నారు.

Back to Top