గ్యాంగ్‌స్టర్ నయీంను పెంచి పోషించింది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ప్రజా ఆందోళనలు జరిగినా వాటిని అణిచేందుకు నయీంను ఉపయోగించేవాడన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూమన బాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ప్రజా ఉద్యమకారులను, ప్రజాప్రతినిధులను చంపించేందుకు చంద్రబాబు నయీంను వాడారని, పెంచి పెద్ద చేశాడని ఆరోపించారు. నయీం ఎదగడానికి చంద్రబాబే కారణం అని చెప్పారు. అలాగే, చంద్రబాబు పుష్కర ఘాట్ లో కూర్చొని ప్రజానేత ఎన్టీ రామారావుకి ఆయన వారసులు లేకుండా పిండప్రధానం చేశాడంటే ఎంతటి స్వార్థపరుడో అర్థం చేసుకోవచ్చని అన్నారు. బీజేపీకి సాగిలపడటం.. డీజీపీని వాడుకోవడం రాష్ట్రానికి జీడీపీ లేకుండా చంద్రబాబు పాలన చేస్తున్నారని విమర్శించారు.