చంద్ర‌బాబు, క‌రువు క‌వ‌ల‌పిల్ల‌లు

అనంతపురంః కరువుతో అల్లాడుతున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైయస్సార్సీపీ నాయకులు అన్నారు. చంద్రబాబు వచ్చాక రైతుల పరిస్థితి దయనీయంగా తయారైందన్నారు. రెయిన్ గన్ లతో కరువును జయించానని ముఖ్యమంత్రి చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే, అనంతపురం జిల్లా రైతాంగానికి అండగా వైయస్ జగన్ మహాధర్నా చేపట్టారని పేర్కొన్నారు.  

బాబు కరువును పెంచుతున్నారు 
అనంతపురం: 2004కు ముందు చంద్ర‌బాబు ప‌రిపాల‌న‌లో  రాష్ట్రంలో స‌కాలంలో వ‌ర్షాలు లేక‌, ప్రాజెక్టుల నుంచి నీరు విడుద‌ల లేక‌, పండించిన పంట‌కు స‌రైన ధ‌ర లేక, రైతులు అప్పుల పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ని వైయ‌స్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం అధ్య‌క్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. చంద్ర‌బాబు పాల‌న‌లో రాష్ట్రంలో 22కేంద్ర స‌హకార బ్యాంకులు ఉండ‌గా 18బ్యాంకులు దివాలా తీసిన దుస్థితి నెల‌కొంద‌ని ఆయ‌న వివ‌రించారు. 2004లో వైయస్ రాజ‌శేఖ‌రరెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక రైతులకు తొమ్మిది గంట‌ల నిరంత‌ర విద్యుత్‌తో పాటు స‌బ్సిడీపై విత్త‌నాలు, వ్య‌వ‌సాయ ప‌నిముట్లు, రుణ‌మాఫీ పేర రైతుల అప్పుల‌న్నింటిని చెల్లించి రైతే రాజు అన్న మాట‌ను నిజం చేశార‌ని నాగిరెడ్డి పేర్కొన్నారు. అనంత‌పురం జిల్లా సాక్షిగా అబ్దుల్‌క‌లాం స‌మ‌క్షంలో జిల్లాను స‌స్య‌శామ‌లం చేస్తామని బాబు చెప్పారని, స‌స్య‌శామ‌లం ప‌రిస్థితి దేవుడెరుగు.. రాష్ట్రం మొత్తం క‌రువు, క‌టకాల‌తో అల్లాడిపోయింద‌ని అన్నారు. చంద్ర‌బాబు నాయుడు, క‌రువు క‌వ‌ల పిల్ల‌ల‌ని... క‌వ‌ల‌ పిల్ల‌ల‌ను విడ‌దీయడం ఎవ్వ‌రి వ‌ల్ల సాధ్యం కాదని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారని చెప్పారు. ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ సాగు భూమిని పెంచుతుంటే,  చంద్ర‌బాబు క‌రువులో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నార‌ని నాగిరెడ్డి ఎద్దేవా చేశారు. ఒక్క అనంత‌పురం జిల్లా నుంచి సుమారు 5ల‌క్ష‌ల మంది రైతులు చెన్నై, బెంగళూరు త‌దిత‌ర ప్రాంతాల‌కు వ‌ల‌స‌లు వెళ్తుంటే చంద్ర‌బాబు మాత్రం అనంత‌పురంలో క‌రువును ఎరిపారేశాన‌న‌డం సిగ్గు చేట‌న్నారు. 

రెయిన్ గన్ ల సినిమాకు బాబు డైరక్షన్
అనంతలో వేరుశనగ అధికంగా పండించే ప్రాంతమైన కదిరి నియోజకర్గంలో పశువుల మేతకు కూడా పనికిరాని పరిస్థితుల్లో పంటను దున్నేసే పరిస్థితి వచ్చిందని స్థానిక నియోజకవర్గ సమన్వయకర్త డా.పివి సిద్దారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాకు. రెయిన్ గన్ ల సినిమాకు బాబు కదిరి నియోజకవర్గంలోనే క్లాప్ కొట్టాడని ఎద్దేవా చేశారు. రాత్రికి రాత్రే పది జేసీబీలతో గుంతలు కొట్టి పది ట్యాంకర్లు తెచ్చి సినిమా తీసుకొని హెలికాప్టర్ లో వెళ్లిపోయాడన్నారు. గుంతలో నీళ్లు లేవు. రెయిన్ గన్ లు తెలుగుదేశం నాయకుల ఇళ్లలోకి చేరాయి తప్ప బాబు రైతులకు చేసిందేమీ లేదని దుయ్యబట్టారు. కరువును పారదోలానంటూ బాబు కోస్తాలో సన్మానం చేసుకోవడం సిగ్గుచేటన్నారు.  మూడేళ్లుగా ఇన్ పుట్ సబ్సిడీ రాక కరువుతో రైతులు అల్లాడుతుంటే  జిల్లా మంత్రులుగానీ, ఎమ్మెల్యేలు గానీ ముఖ్యమంత్రిని ప్రశ్నించకపోవడం దారుణమన్నారు.  ఎకరాకు 20 వేలు ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం ఉన్నా ప్రశ్నించే సాహసం, దమ్ము ధైర్యం టీడీపీ నేతలకు లేకుండా పోయిందన్నారు. రైతుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే తమ అధినేత వైయస్ జగన్ ఇక్కడకు వచ్చారని చెప్పారు. రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బాబు చేతగాకపోతే తమ ప్రభుత్వం వచ్చాక వైయస్ జగన్ రైతులను అన్ని విధాల ఆదుకుంటారని స్పష్టం చేశారు. 

బాబుకు రైతులు తగిన బుద్ధి చెప్పాలి
అనంత‌పురం జిల్లాలో ఒక్క ఎకరా కూడా తడపకుండా... రెయిన్‌గ‌న్‌ల‌ను చూసి క‌రువు పారిపోయిందని చంద్రబాబు చెప్పడం దుర్మార్గమని సింగనమల నియోజకవర్గ నాయకుడు సాంబశివారెడ్డి మండిపడ్డారు.  రైతుధ‌ర్నాలో పాల్గొన్న జ‌న‌సందోహాన్ని చూసైనా అనంత‌పురం జిల్లాలో క‌రువు ఏ స్థాయిలో ఉందో చంద్ర‌బాబు అర్థం చేసుకోవాల‌న్నారు. ఎన్నిక‌ల‌కు ముందు రైతుల‌కు రుణ‌మాఫీ చేసి ఇంటింటికి పెద్ద‌కొడుకును అవుతాన‌న్న చంద్ర‌బాబు హామీ ఏమైంద‌ని నిలదీశారు. 2019 ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబుకు రైతులు త‌గిన‌ బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు. 
Back to Top