చంద్రబాబుది అరాచక పాలన

నెల్లూరు: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అరాచక పాలన సాగిస్తున్నారని వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు.  మేకపాటి నెల్లూరులో మీడియాతో మాట్లాడారు. టీడీపీ మహానాడులో ప్రతిపక్ష వైయస్సార్సీపీని విమర్శించడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో ప్రజలకు ఏం చేయ దలచుకున్నారో చంద్రబాబు చెప్పకపోవడం బాధాకరమన్నారు . బాబు తీరును ప్రజలు గమనిస్తున్నారని తగిన సమయంలో బుద్ధి చెప్పుతారని మేకపాటి హెచ్చరించారు. రాజ్యసభకు టీడీపీ నాలుగో అభ్యర్థిని నిలబెట్టినా...తమ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి సులభంగా విజయం సాధిస్తారని వైయ‌స్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

Back to Top