అభివృద్ధి చూపి ఓట్లడిగే దమ్ము బాబుకు లేదు

విజయవాడ: అభివృద్ధి చూసి ఓట్లేయండి అని అడిగే దమ్ము లేక చంద్రబాబు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైయస్‌ఆర్‌ సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రెండు రోజుల పాటు టీడీపీ నేతలకు వర్క్‌షాప్‌ నిర్వహించి పీ3 (పోలీస్, పర్చెజ్, పోలవరం)తో ఎన్నికల్లో గెలవాలని ఉద్భోద చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్క్‌షాప్‌లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

తాజా ఫోటోలు

Back to Top