ప్రజాపోరాటం చేసేవాళ్లు ఉన్మాదులా?గంట ప్రెస్‌మీట్‌లో 45 నిమిషాలు జగన్ పై విమర్శలేమొదటి ఐదు సంతకాల మాటేమిటి?బాబును ప్రశ్నించిన భూమన కరుణాకర్ రెడ్డిహైదరాబాద్: వెయ్యి తలల విషనాగు లాంటి గ్యాంగ్‌స్టర్ నయీంను పుట్టించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని వైయస్ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. ప్రజా ఉద్యమాలు చేసే ప్రతి ఒక్కర్నీ చంపించేందుకు బాబు నయీంను ఉపయోగించుకున్నారన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన విలేకరుల సమావేశంలో భూమన కరుణాకర్ రెడ్డి బాబు దుర్మార్గ పాలనపై మండిపడ్డారు. పుష్కరాల్లో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు పిండ ప్రధానం పెట్టే అవకాశాన్ని ఆయన కుమారులకు అవకాశం ఇవ్వకుండా చంద్రబాబే పెట్టడం దారుణమన్నారు. నాడు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి నేడు పిండాలు పెట్టడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.<strong>గంట ప్రెస్‌మీట్‌లో 45 నిమిషాలు జగన్‌ను తిట్టడమే...</strong>చంద్రబాబు నిర్వహించే ప్రెస్‌మీట్‌లో గంటలో 45 నిమిషాలు జగన్‌ను తిట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారన్నారు భూమన విమర్శించారు. 30ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు మానసిక స్థితి దిగజారిపోయిందని, అందుకే వైయస్ జగన్‌పై ఇలా ఏది పడితే అది మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు తన అవినీతిపై శాసనసభలో మాట్లాడనివ్వకుండా ప్రతిపక్ష నేత గొంతు నొక్కేస్తూ... ప్రజాక్షేత్రంలో నిలదీయకుండా లాఠీలతో కొట్టిస్తూ... న్యాయవ్యవస్థకు వెళ్లితే ఉన్మాదులంటూ కాలం వెళ్లదీస్తున్నారని భూమాన మండిపడ్డారు. సమాజంలో ఉన్న అన్ని వ్యవస్థలను బాబు తన అవినీతికి వినియోగించుకుంటున్నారు. చంద్రబాబు అవినీతిపై ప్రజలు గుండాలను... రౌడీలను ఆశ్రయించాలా అని ప్రశ్నించారు. బాబు అవినీతి, అక్రమాలను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ , ప్రతిపక్ష నాయకుడుగా వైయస్ జగన్ చుస్తూ ఊరుకోడని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతామని స్పష్టం చేశారు. <strong>ప్రజా పోరాటం చేసేవాళ్లంతా ఉన్మాదులా?</strong>అమరావతిలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లిన సీనియర్ జర్నలిస్ట్ ఏబీకే ప్రసాద్‌ను ఉన్మాది అనడం సిగ్గు చేటన్నారు. సామాజిక బాధ్యత కలిగిన సీనియర్ పాత్రికేయుడు... సంఘ సంస్కరణ ఉద్యమాల్లో పాలు పంచుకున్న వ్యక్తి... వేలాది మంది పాత్రికేయులను తయారు చేసిన ఏబీకే ప్రసాద్ అమరావతి రైతుల ఆవేదనను చూడలేక సుప్రీం కోర్టుకు తీసుకెళ్లాన్నారు. దానికి ప్రతి స్పందగా సుప్రీం కోర్టు మీరు రైతు కాదు గనక... ఏవరైన రైతులు పిటిషన్ వేస్తే స్వీకరిస్తామని చెప్పిన దానిని కూడా చంద్రబాబు వ్యక్రీకరిస్తూ మాట్లాడడం బాధకరమని భూమాన పేర్కొన్నారు. ఏబీకే ప్రసాద్ వెనుక వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. సుప్రీం కోర్టు అసలు రాజధానిలో అవినీతి, అక్రమాలే జరగలేదనట్లు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. <strong>తొలి ఐదు సంతకాల మాటేమిటి బాబూ?</strong>బాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం చేసిన తొలి ఐదు సంతాకాల్లో ఒక్కటి కూడా సరైన రీతిలో అమలు కాలేదని భూమన ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన 500 హామీల్లో ఒక్కటైనా అమలైందా? అని భూమన చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు అప్రజాస్వామిక, అహాంకారిక విధానాలపై వైయస్ జగన్ పోరాడుతున్నారన్నారు. పట్టిసీమకు వైయస్ జగన్ గండికొట్టించారని చెప్పడం హాస్పస్పదమన్నారు. <strong>పుష్కరాలను మీరే తెచ్చారా?</strong>పుష్కరాలను సైతం తానే తెచ్చానని చంద్రబాబు చెప్పుకుంటే ముష్కరుడిగానే మిగిలిపోతారని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. పుష్కరాలు ప్రభుత్వ కార్యక్రమం కాదని, పుష్కరాలు అత్యంత పుణ్య కార్యక్రమం అని వివరించారు. చంద్రబాబు పుష్కర స్నానం చేస్తూ పట్టిసీమలో వెయ్యి కోట్లు స్వాహా... రాజధాని అమరావతిలో లక్షకోట్లు స్వాహా... పుష్కరాల పేరుతో రూ. 3 వేల కోట్లు కేటాయించి... అందులో రూ. 500 కోట్లు ఖర్చు పెట్టి, రూ. 2,500 కోట్లు స్వాహా అంటూ స్నానం చేశారని భూమన ఆగ్రహం వ్యక్తం చేశారు.