చంద్రబాబు మోసాలను ప్లీనరీలో ఎండగడతాం

పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబు మోసాలను ప్లీనరీ సమావేశాల ద్వారా ఎండగడదామని కడప ఎంపీ వైయస్‌అవినాష్‌రెడ్డి, జిల్లా పార్టీ వ్యవహారాల సమన్వయకర్త వైయస్‌వివేకానందరెడ్డి, పులివెందుల వైయస్‌ఆర్‌సీపీ నేత వైయస్‌ మనోహర్‌రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం పులివెందులలోని వైయస్‌వివేకానందరెడ్డి సృగృహంలో వారు మాట్లాడుతూ... ప్లీనరీ సమావేశాల ద్వారా బూత్‌స్థాయి నుంచి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకునే వీలుంటుందన్నారు. పార్టీ పటిష్టతకు బూత్‌స్థాయి నుంచే శ్రీకారం చుడతామన్నారు. అలాగే సమావేశాల్లో చంద్రబాబు మోసాలను ప్రజలకు వివరిస్తామన్నారు. ఎన్నికలప్పుడు అనేక అపద్దపు హామిలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏ ఒక్క హామీని పూర్తిగా అమలుపరచలేదన్నారు. చంద్రబాబు, ఆయన తనయుడు రాష్ట్రాన్ని దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారన్నారు. విభజనతో అసలే కష్టాలల్లో ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు తన అవినీతితో మరింత కష్టాలలోకి నెడుతున్నారన్నారు. రాష్ట్రానికి సంజీవని లాంటి ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు అనేక అనైతిక కార్యకలాపాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే వైయస్‌ఆర్‌సీపీ ప్లీనరీ సమావేశాల ద్వారా పార్టీని బలోపేతం చేయడమే కాకుండా, చంద్రబాబు అరాచకాలను కూడా ప్రజలకు వివరిస్తామన్నారు. పులివెందుల నియోజకవర్గ పార్టీ ప్లీనరీ సమావేశ తేదీని నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు జూన్‌8వ తేదీలోపు ఏదోక రోజు నిర్వహిస్తామని తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top