చంద్రశేఖర్ దంపతులను విడుదల చేయండి

హైదరాబాద్, 3 డింసెంబర్ 2012:

ప్రవాసాంధ్రులు చంద్రవేఖర్ దంపతులను నార్వే పోలీసులు అరెస్ట్ చేయడం దురదృష్టకరమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ఆర్ఐ విభాగం పేర్కొంది. తమ పిల్లల విషయంలో నార్వే చట్టాలకు విరుద్ధంగా చంద్రశేఖర్ దంపతులు వ్యవహరించారన్న ఆరోపణలపై అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. చంద్రశేఖర్ ఆయన భార్య అనుపమలను మానవతాదృక్పధంతో వెంటనే విడుదల చేయాలని నార్వే అధికారులు, న్యాయమూర్తులకు వైయస్ఆర్ సీపీ ఎన్ఆర్ఐ విభాగం కన్వీనర్ వెంకట్ మేడపాటి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వెంకట్ సోమవారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు.

      తెలియక చేసిన తప్పుకు చంద్రశేఖర్ దంపతులను జైలుపాలు చేస్తే, వారి ఇద్దరు చిన్నారులు అనాధలవుతారని వెంకట్ మేడపాటి ఆందోళన వ్యక్తం చేశారు. మానవతాదృక్పధంతో ఈ భారతీయ దంపతులను వెంటనే విడుదల చేయాలని నార్వే కోర్టు న్యాయమూర్తికి వెంకట్ విజ్ఞప్తి చేశారు.

తాజా వీడియోలు

Back to Top