చంద్రబాబుపై పార్టీ నేతల మండిపాటు

హైదరాబాద్, 02 ఏప్రిల్ 2013:

విద్యుత్తు చార్జీల పెంపునకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే కారణమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడ్డారు. అవిశ్వాసంలో బాబు పాల్గొనిఉంటే .. ఛార్జీల భారం ప్రజలపై పడేది కాదని వారు అభిప్రాయపడ్డారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్‌ఆర్‌ హామీ ఇచ్చినట్లుగా  చార్జీల పెంపును నిలిపేయాలనీ, రైతులకు ఉచిత విద్యుత్తును నిబంధనలు లేకుండా ఇవ్వాలనీ వారు డిమాండ్‌ చేశారు. పేదలకు అండగా ఉండేందుకే పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి  వైయస్‌ విజయమ్మ దీక్ష చేపట్టారని తెలిపారు. దివంగత మహానేత డాక్టర వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఎప్పుడూ పన్నులు పెంచలేదనీ, ఆయన దయతో వచ్చిన సర్కారు ప్రజలపై మోయలేని భారం వేస్తోందని శ్రీమతి విజయమ్మ మండిపడ్డారు. ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. మహానేత భౌతికంగా దూరమైనా ఆయనపై, కుటుంబంపైనా ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని విమర్శించారు. అటు పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్, ఇటు శ్రీమతి వైయస్ షర్మిల ప్రజలకు అండగా ఉంటారన్నారు. ప్రజలే ప్రధాన ప్రతిపక్షానికి సరైన సమయంలో బుద్ధి చెబుతారని విజయమ్మ  హెచ్చరించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుపై ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బషీర్ బాగ్ ప్రాంతాన్ని చూస్తే చంద్రబాబు అరాచకాలు గుర్తుకు రావా అని ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని ఎమ్మెల్యేలతో బాబు దీక్ష చేయిస్తున్నారని నిలదీశారు. అసెంబ్లీలో తాము గొంతెత్తినా ప్రభుత్వం చెవికెక్కించుకోలేదని వ్యాఖ్యానించారు. అందుకే ఈ కరెంట్ సత్యాగ్రహాన్ని చేపట్టామనీ, పెంచిన ఛార్జీలను ప్రభుత్వం భరించాలన్నదే తమ డిమాండనీ  విజయమ్మ అన్నారు.
విజయమ్మ దీక్షకు మద్దతు: రాఘవులు
ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన శ్రీమతి విజయమ్మకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు మద్దతు ప్రకటించారు.  ఈనెల 9న నిర్వహించ తలపెట్టిన బంద్కు సహకరించాలని ఆయన మంగళవారమిక్కడ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలపై ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా రాఘవులు ఖండించారు.
దీక్షలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు    
శ్రీమతి విజయమ్మ చేపట్టిన దీక్షలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలలో గొల్ల బాబూరావు(పాయకరావుపేట), తెల్లం బాలరాజు(పోలవరం), మేకతోటి సుచరిత(ప్రత్తిపాడు), పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(మాచర్ల), బాలినేని శ్రీనివాసరెడ్డి(ఒంగోలు), నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి(కోవూరు), మేకపాటి చంద్రశేఖరరెడ్డి(ఉదయగిరి), భూమన కరుణాకరరెడ్డి(తిరుపతి), ఆకేపాటి అమర్‌నాథరెడ్డి(రాజంపేట), శ్రీనివాసులు(రైల్వే కోడూరు). శ్రీకాంత్‌రెడ్డి(రాయచోటి), కాపు రాంచంద్రారెడ్డి(రాయదుర్గం), గుర్నాథరెడ్డి(అనంతపురం అర్బన్), భూమా శోభానాగిరెడ్డి(ఆళ్ళగడ్డ), సుజయకృష్ణ రంగారావు(బొబ్బిలి), ఆళ్ల నాని(ఏలూరు), కొడాలి నాని(గుడివాడ), మద్దాల రాజేశ్ కుమార్(చింతలపూడి), తానేటి  వనిత(గోపాలపురం), ప్రవీణ్‌కుమార్‌రెడ్డి (తంబళ్లపల్లె), ఎన్‌.అమరనాథరెడ్డి, సాయిరాజు, జోగి రమేశ్‌(పెడన), గొట్టిపాటి రవి కుమార్‌(అద్దంకి), పేర్ని నాని(మచిలీపట్నం),  శ్రీశైలంగౌడ్‌(కుత్బుల్లాపూర్), ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి(కాకినాడ), ఎమ్మెల్సీలలో జూపూడి ప్రభాకర్‌రావు, మేకా శేషుబాబు, దేశాయి తిప్పారెడ్డి, ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు.

Back to Top