ప్రత్యేక హోదా ఉద్యమకారులపై అక్రమ కేసులు


అనంతపురం: ప్రత్యేక హోదా ఉద్యమంపై చంద్రబాబు సర్కార్‌ ఉక్కుపాదం మోపుతోంది. ఉద్యమకారులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. హోదా కోసం పోరాటం చేస్తున్న వైయస్‌ఆర్‌సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైయస్‌ఆర్‌సీపీ తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డితో పాటు 53 మంది పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం తాను పోరాటం చేస్తున్నట్లు తన కేంద్ర మంత్రులతో రాజీనామా చేయించి, మరోవైపు హోదా కోసం పోరాటం చేస్తున్న నాయకులపై కేసులు పెట్టడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు.
 
Back to Top