నంద్యాల: నంద్యాల అభివృద్ధికి భూమా కుటుంబం చేసింది ఏమీ లేదని మల్కిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు 2014కు ముందు ఎలాంటి వాగ్ధానాలు చేశారో అందరికి తెలుసు. గత 9 ఏళ పాలనలో చంద్రబాబు మోసం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చాక అదే మోసాలు కొనసాగిస్తున్నారు. మూడేళ్లలో నంద్యాల గురించి పట్టించుకోలేదు. ఇవాళ ఉప ఎన్నికలు వచ్చాయని అభివృద్ధి అంటూ డ్రామాలు ఆడుతున్నారు. ఎంపీ ఎస్పీవైరెడ్డి ఏ ఒక్క పని చేయలేదు. భూమా నాగిరెడ్డి కూడా టీడీపీలో చేరినా ఏ ఒక్క అభివృద్ధి చేయలేదు. నంద్యాల అంటే ఈ రోజు దేశం మొత్తం మనవైపు చూస్తోంది. చంద్రబాబు రోడ్ల విస్తరణ అంటూ అందర్ని నడిరోడ్డుపై పడేశారు. ఎన్నికలు అయిపోయిన తరువాత అభివృద్ధి ఎక్కడ వేసినా గొంగలి అక్కడే ఉంటుంది. ఈ రోజు అఖిల ప్రియ వైయస్‌ఆర్‌సీపీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై ఆ పార్టీనే విమర్శిస్తున్నారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే అభివృద్ధి సాధ్యమవుతుంది. నేను ఎప్పుడు వైయస్ జగన్‌ను కలిసినా నంద్యాల ప్రజలు ఎలా ఉండారని అడుగుతారని, ముస్లింలపై ఆయనకు ప్రత్యేక శ్రద్ధ ఉందన్నారు. ఉప ఎన్నికలో శిల్పా మోహన్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలోకి రావాలంటే నంద్యాలలో ఇప్పుడు అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని రాజగోపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.