బుడంగపల్లెలో షర్మిల రచ్చబండ

బుడంగపల్లె:

మరో ప్రజాప్రస్థానం సందర్భంగా షర్మిల ధర్మవరం మండలం బుడంగపల్లెలో శనివారం ఉదయం రచ్చబండ నిర్వహించారు. ఇందులో మహిళలతో మాట్లాడారు. తాము తాగునీటికి అష్టకష్టాలూ పడుతున్నామని ఆ గ్రామస్థులు వైయస్ షర్మిలకు మొరపెట్టుకున్నారు. నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచివెళ్ళాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల వారితో మాట్లాడుతూ, సీయం గారి భార్య కూడా మూడు కిలోమీటర్లు నడిచి మంచినీళ్ళు తెచ్చుకుంటే ఆవిడకు ఈ కష్టాలు తెలుస్తాయని చెప్పారు. ఆమె సీఎం క్యాంప్ ఆఫీసులో చల్లగా కూర్చున్నారనీ, సామాన్యుల వెతలు సీఎంకు పట్టడం లేదనీ తెలిపారు.

Back to Top