బింగిదొడ్డి నుంచి ప్రారంభమైన పాదయాత్ర

మహబూబ్ నగర్, 26 నవంబర్ 2012: దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన పాదయాత్రను సోమవారం ఉదయం జిల్లాలోని బింగిదొడ్డి నుంచి  ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పాదయత్ర  ఐదో రోజు కొనసాగుతోంది. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల పాదయాత్ర సోమవారం నాటికి  40వ రోజుకు చేరుకుంది. ఆదివారం నాటికి షర్మిల పాదయత్ర 522.90 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. సోమవారం నాడు పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర 16.2 కిలో మీటర్లు కొనసాగనుంది.

Back to Top