వైయస్‌జగన్‌ పోరాటానికి నితీశ్‌ సంఘీభావం

న్యూఢిల్లీ :

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న పోరాటానికి బీహార్ ‌సీఎం నితీశ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. విభజనను అడ్డుకునేందుకు జాతీయ నేతల మద్దతు కూడగడుతున్న ప్రయత్నంలో భాగంగా శుక్రవారం నితీ‌శ్‌తో శ్రీ జగన్ ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రాల విభజనను అడ్డుకునేందుకు జాతీయ పార్టీలన్నీ ఏకం కావాల్సిన అవసరాన్ని నితీశ్‌కు వివరించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లును అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా శ్రీ జగన్ పోరాటానికి నితీ‌శ్ సంఘీభావం తెలిపారు. అలాగే లో‌క్‌సభలో సీమాంధ్ర సభ్యుల సస్పెన్షన్‌ను ఎత్తివేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Back to Top