భువనగిరి బయలుదేరిన విజయమ్మ

ఉప్పల్:

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ నల్గొండ జిల్లా భువనగిరికి బయలుదేరారు. తెలంగాణ యువ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి పార్టీలో చేరనున్న సందర్భంగా అక్కడ నిర్వహించే సభకు ఆమె హాజరవుతారు. భువనగిరి వరకూ ఆమె వెంట ఉంటామని ఉప్పల్ ప్రాంతానికి చెందిన నాయకులు చెప్పారు. ఆమెకు స్వాగతం పలికేందుకు ఉప్పల్ బస్సు స్టాండు వద్ద వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేసింది.  నాయకులు జనార్దన రెడ్డి తదితరులు  ఇక్కడ ఉన్నారు. విజయమ్మ కోసం వేచి చూస్తున్నా వారు మాట్టాడుతూ అరచేతిని అడ్డపెట్టి సూర్యకాంతిని ఆపలేరని స్పష్టంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని కుట్ర చేసి జైలులో పెట్టారని వారు ఆరోపించారు.

Back to Top