ఇంట్లో కూర్చుని చంద్రబాబు ఏం చేస్తున్నారు?

అనంతపురం, 28 ఆగస్టు 2013:

రాష్ట్రం అట్టుడికిపోతుంటే టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నారని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు భూమా నాగిరెడ్డి ప్రశ్నించారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి దీక్షకు మద్దతుగా తాడిపత్రిలో ఆమరణ దీక్ష చేస్తున్న వి.ఆర్. రామిరెడ్డికి సంఘీభావం తెలిపిన అనంతరం నాగిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

యుపిఎ సమన్వయ కమిటీ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన అనంతరం సీమాంధ్రలో ఆందోళనలు మిన్నంటితే చంద్రబాబు హాయిగా కూర్చుని చోద్యం చూస్తున్నారని భూమా ఎద్దేవా చేశారు. రెండు కళ్ల సిద్ధాంతం  అవలంభిస్తున్న చంద్రబాబు నాయుడు సీమాంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని నిప్పులు చెరిగారు.  శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని భూమా తెలిపారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top