పార్టీ 'బీసీ' సమన్వయకర్తల నియామకం

హైదరాబాద్ 15 జూలై 2013:

వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ విభాగానికి వివిధ జిల్లాల సమన్వయకర్తలను పార్టీ నియమించింది. బీసీ విభాగం అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు సోమవారం వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు గుంట్రెడ్డి శ్రీరమాదేవి, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలకు ఏ.వి.ఎస్.నాయుడు, తూర్పు గోదావరి జిల్లాకు సీతాదేవి వనపల్లి, గుంటూరు ప్రకాశం జిల్లాలకు తొండమల్ల పుల్లయ్య, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాలకు అవ్వారు ముసలయ్య, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు దశరథుల నారాయణ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎ.ఎల్.మల్లయ్య, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు సతీష్ గౌడ్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు నిమ్మల ఇందిర, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు జూడ్ విన్సెంట్ నియమితులయ్యారు. ఈ జిల్లాల్లో బీసీ విభాగం కార్యక్రమాలను వీరు సమన్వయం చేస్తారు.

Back to Top