'బస్సు ఛార్జీల'పై వైయస్‌ఆర్ సీపీ పోరాటం

హైదరాబాద్, 26 సెప్టెంబర్‌ 2012: ప్రజా సమస్యలపై వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ మరో పో‌రాటం ప్రారంభించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇబ్బడిముబ్బడిగా పెంచేసిన ఆర్టీసీ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలంటూ బుధవారం ఉదయం నుంచీ అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేపట్టింది. నిరుపేదలు, సామాన్యులపై అధికంగా భారం వేసేలా కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకున్న ఛార్జీల పెంపునకు నిరసనగా ప్రజల పక్షాన వైయస్‌ఆర్‌ సిపి నిలిచింది. బస్సు ఛార్జీలు ఉపసంహరించేలా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ధర్నాలు, ఆందోళనలు ప్రారంభించారు.‌ సిగ్గుమాలిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో ప్రజావ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటోందని పార్టీ నేతలు తీవ్ స్థాయిలో మండిపడుతున్నారు.

Back to Top