ఓటర్లతో ఇంటలిజెన్స్‌ అధికారుల బేరసారాలు

నంద్యాల: తెలంగాణ దేశం పార్టీ నంద్యాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేపట్టింది. ఉప ఎన్నికల సందర్భంగా ఇంటలిజెన్స్‌ అధికారులను ప్రభుత్వం నంద్యాలకు దించిందన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వైయస్‌ఆర్‌ సీపీ నేతలు ఆరోపించారు. 5, 10 ఓట్లున్న కుటుంబాలను టార్గెట్‌ చేసుకొని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తూ బేరసారాలకు దిగుతున్నారని వైయస్‌ఆర్‌ సీపీ మండిపడుతుంది. అనధికారికంగా తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు ఈసీకి ఫిర్యాదు చేయాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నిర్ణయించింది.

Back to Top