‘బద్వేలు’ బంద్

బద్వేలు : వైఎస్సార్ జిల్లాలోని బద్వేలులో ప్రభుత్వాస్పత్రి తరలింపును నిరసిస్తూ అన్ని పార్టీల ఆధ్వర్యంలో శుక్రవారం బంద్ జరిగింది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే జయరాములుతో పాటు స్థానిక ప్రజలు ఈ బంద్‌లో పాల్గొన్నారు. బద్వేలులో 100 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ప్రభుత్వాస్పత్రిని భవనం శిధిలావస్థకు చేరిందనే కారణంతో ఇటీవల ప్రసూతి వైద్య సేవల ఆస్పత్రి ప్రాంగణంలోకి మార్చారు.

దీన్ని స్థానిక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉన్న పాత ప్రభుత్వాస్పత్రి భవనంలోనే ప్రాథమిక వైద్య సేవలనైనా అందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయినా, అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం బంద్ నిర్వహించారు.

Back to Top