<strong>ఢిల్లీః</strong> దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున చేపట్టిన వంచనపై వైయస్‌ఆర్‌సీపీ గర్జన నిరసన దీక్షతో నరేంద్రమోదీ కళ్లు తెరవాలని వైయస్‌ఆర్‌సీపీ నేత జోగి రమేష్ అన్నారు.ఢిల్లీలో వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. టీడీపీ,బీజేపీ ప్రభుత్వాలు ఏపీకి చేస్తున్న తీరని అన్యాయంపై మండిపడ్డారు.మోదీ, చంద్రబాబు కలిసి ఆడుతున్న నాటకంలో ఏపీ ప్రజలు ఏవిధంగా నష్టపోయారో ఢిల్లీ గడ్డ మీద వైయస్‌ఆర్‌సీపీ గర్జింస్తోందన్నారు.ప్రత్యేకహోదా వస్తేనే రాష్ట్ర భవిష్యత్,పిల్లల భవిష్యత్ బాగుటుందని వైయస్ జగన్ ఆధ్వర్యంలో వైయస్‌ఆర్‌సీపీ నిరంతరం పోరాడుతున్నారన్నారు.నాలుగు సంవత్సరాలు బీజేపీతో అంటకాగిన చంద్రబాబు..మోదీని ప్రశంసించి,జేజేలు పలికి, సన్మాలు చేసి నేడు మోదీని వదిలేసి..రాష్ట్రాన్ని ముక్కలు చేసిన సోనియాగాంధీ పంచన చేరాడని మండిపడ్డారు.ఈ నాలుగున్నరేళ్లులో ఏం సాధించావో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు.ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసి ఆర్టీసీ బస్సులో జనాన్ని తరలించి ధర్మపోరాట దీక్షలు చేస్తావా అంటూ దుయ్యబట్టారు.