<strong>కాకినాడః </strong> ప్రజలకు నమ్మకానికి ప్రతికగా వైయస్ జగన్ నిలబడ్డారని వైయస్‌ఆర్‌సీపీ నేత కురసాల కన్నబాబు అన్నారు. కాకినాడలో వైయస్‌ఆర్‌సీపీ నిర్వహిస్తున్న వంచనపై గర్జన దీక్ష లో ఆయన మాట్లాడారు. నయవంచన పాలన సాగుతోందని మండిపడ్డారు. 2014లో చంద్రబాబు కొంగజపాన్ని నమ్మి ప్రజలు గెలిపించారని, చంద్రబాబు అనుభవాన్ని నమ్మి ప్రజలు అ«ధికారం ఇస్తే దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను గాలికొదిలి ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఏపీని విభజించిన కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు జతకట్టారని, తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు తెలంగాణ విడిపోవడానికి, రావడానికి నేనే కారణమని చెబుతున్నారని, ఆంధ్రకు ఎంత అన్యాయం చేశారో ఆయన నోటినుంచే చెప్పారన్నారు.ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణ రావడానికి చంద్రబాబు ఇచిన సహకారం కుడా మరవలేదని కాంగ్రెస్ జాతీయ నాయుకులు ప్రశంసలు కురిపిస్తున్నారని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక కావాలని మొదటి నుంచి మడమతిప్పని పోరాటం చేసున్న యోధుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి అని, భవిష్యత్ తరాలు కూడా ఆధారపడి ఉన్నాయని ఎన్నో పోరాటలు చేశారన్నారు. వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తుంటే.. ప్రత్యేక హోదా అవసరం లేదు..ప్రత్యేకప్యాకేపజీ చాలు అని మీ పిల్లలను అదుపులో పెట్టుకోవాలని, జైలు పంపిస్తామని తల్లిదండ్రులను చంద్రబాబు బెదిరింపులను గుర్తుచేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రజలు మోసం చేశాయని, అనుభవం చూసి అధికారం ఇస్తే అడ్డంగా దోచుకున్నారన్నారని మండిపడ్డారు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు..మళ్లీ కాంగ్రెస్‌తో జతకట్టారన్నారు. ప్రత్యేకహోదా కోసం వైయస్ జగన్ అలుపెరగని పోరాటం చేస్తున్నారని, చంద్రబాబు నయవంచనకు కౌంట్‌డౌన్ ప్రారంభమయిందని టీడీపీ మోసాలను ప్రజలను అర్థం చేసుకున్నారన్నారు.