బాబు వెళ్లింది సదస్సు కాదు....రుణం కోసం

చంద్రబాబు
వెళ్ళింది. ఐక్య రాజ్యసమితి సదస్సుకు కాదు..

వ్యవసాయంపై
చంద్రబాబు ప్రకటనలు వాస్తవదూరం

ఏపీలో 70 శాతం రైతులు
అప్పుల్లో ఉన్నారు..

పిఎసి ఛైర్మన్  బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి

హైదరాబాద్ పెద్ద ఎత్తున
ప్రచారం చేసుకూంటూ ఐక్యరాజ్య సమితి సమావేశమంటూ ముఖ్యమంత్రి వెళ్లింది అప్పుల కోసం
తప్ప మరో ప్రయోజనమేమీ లేదని పిఎసి చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
మండిపడ్డారు. ప్రకృతి సేద్యానికి బడ్జెట్ లో నామమాత్రపు కేటాయింపులు చేసి, రాష్ట్ర
మంతటా దాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారని ప్రచారం చేసుకోవడం నయవంచన ఆయన ఆయన
ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఆయన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ , ప్రకృతి సేద్యం పేరుతో రాష్ట్ర ప్రజల నెత్తిన మరో 16వేల కోట్ల మేర అప్పుల
భారాన్ని మోపే ప్రయత్నాల్లో భాగంగానే ఇటువంటి డ్రామాలకు తెరదీశారన్నారు.

 ప్రకృతి వ్యవసాయంపై
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగం చేయడానికి ఆహ్వానం అందినట్లు గొప్పగా చెప్పుకున్న
చంద్రబాబు పాల్గొన్న సమావేశాన్ని ఢిల్లీలో ఉన్న సస్టెయినబుల్‌ ఇండియా ఫైనాన్స్‌
ఫెసిలిటీ అనే సంస్ద నిర్వహించిందనీ, దీని పరిశోధనాస్దానం గుంటూరు నగరం, అమరావతి రోడ్డులోని గోరంట్లలో ఉన్నాయన్నారు.

ఈ సంస్థ  యు ఎన్‌ ఎన్విరాన్‌
మెంట్, వరల్డ్‌ ఆగ్రో పారెస్ట్‌ సెంటర్, అమెరికాలోని పరిభాష్‌ బ్యాంక్‌ లతో కలసి సదస్సును ఐక్యరాజ్యసమితి
భవనంలోని ఓ చిన్న కాన్ఫరెన్స్‌ హాల్‌ లో ఏర్పాటు చేసిందని బుగ్గన వివరించారు. ఐక్యరాజ్యసమితి
ప్రధాన హాలులో ప్రసంగించడానికి ప్రపంచ ప్రతినిధులు,ప్రత్యేక ఆహ్వానితులకే అవకాశం
ఉంటుందని, కాని ఐక్యరాజ్యసమితి ఆహ్వానం పంపినత ప్రచారం చేసుకున్నారన్నారు. అసలు చంద్రబాబు
ఈసమావేశంలో పాల్గొనడానికి ముందు నుంచే ఒక్క పక్కా ప్రణాళికతో ప్రచారం చేసుకుంటూ
రుణ సమీకరణకు పూనుకున్నారన్నారు.

 ఈ సదస్సు
ఏర్పాటుచేయడానికి ముందు 2018 జూన్‌ 26న న్యూయార్క్‌ టైమ్స్‌ లో వచ్చిన ఆర్టికల్‌ లో ఏపిలో ప్రకృతి
వ్యవసాయం మహా గొప్పగా జరుగుతోందంటూ  రాశారనీ
వివరిస్తూ, ఆ తర్వాతనే ఈ సదస్సు ఏర్పాటుచేసి చంద్రబాబును ఆహ్వానించినట్లు ఓ సెటప్‌
చేసినట్లు కనపిస్తోందని బుగ్గన పేర్కొన్నారు. ఏపిలో ప్రకృతి వ్యవసాయం కోసం 16,600 కోట్లు అవసరపడతాయనివాటిని పరిభాష్‌ బ్యాంక్‌ ద్వారా ఇప్పించేందుకు
ఎస్‌ ఐ ఎఫ్‌ ఎఫ్‌ ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తోందన్నారు. ఈ రుణం కోసమే చంద్రబాబు
ఉన్నవీ, లేనివి చెప్పి 2024 నాటికి ఏపి అంతటా ప్రకృతి వ్యవసాయం చేస్తారంటూ గొప్పలు
చెప్పినట్లుగా ఉందన్నారు.

ఆంధ్రపదేశ్‌లో 3లక్షల మంది రైతులు
ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని, ఈ
సంఖ్యను అనేక రెట్లు పెం చుతూ 2 కోట్ల ఎకరాలకు విస్తరించాలంటే,16 వేల ఆరువందల
కోట్లు రుణం  అవసరం ఉంటుందని చంద్రబాబు తెలిపారన్నారు.

ప్రకృతి వ్యవసాయంపై
ఈ ప్రశ్నలకు సమాధానాలివ్వండి

అసలు ఏపి బడ్జెట్‌
లో ప్రకృతి వ్యవసాయానికి ఎంత కేటాయించారన్న విషయాన్ని ఒకసారి చూస్తే 39 కోట్లు కేటాయించినట్లు గణాంకాలు
చెపుతున్నాయనీ వివరిస్తూ, ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీటికి సమాధానాలు
చెప్పాలని డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో జీరో
బడ్జెట్‌ ప్రకృతి వ్యవసాయం వాస్తవమేనా.. ఇది సాధ్యమేనా?

 ప్రకృతి సేద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం
చేస్తున్న కృషి ఏంటి?

ప్రకృతి
వ్యవసాయానికి సంబందించి సీడ్‌ సర్టిఫికేషన్‌ సెంటర్‌ ఉందా?

ప్రకృతి వ్యవసాయం
చేసేవారికి ఇన్సెంటివ్‌ లు ఏమన్నా ఇస్తున్నారా?

  భారతదేశంలో
వ్యవసాయం చేస్తున్నవారిలో అత్యధిక అప్పులు చేసిన రైతులు ఏపిలో ఉన్నారనీ, ఏపిని అప్పుల
రాష్ట్రంగా మారుస్తున్నారనీ మండిపడ్డారు. 2014లో ఆంధ్రకు 97వేల కోట్లు అప్పుఉంటే
దాన్ని టీడీపీ ప్రభుత్వం  2.50
లక్షల కోట్లకు తీసుకుపోయిందన్నారు. 1లక్ష 50 వేలు అప్పు ప్రజల
నెత్తిపై మోపారని దుయ్యబట్టారు. ఇది చాలక  ప్రకృతి వ్యవసాయం
పేరుతో మరో 16వేల ఆరువందల కోట్లు రుణాన్ని తీసుకువచ్చేందుకు
ప్రయత్నాలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం  చేశారు.

ఏపిలో 2024 నాటికి రైతులందరూ ప్రకృతి వ్యవసాయం చేస్తారని చంద్రబాబు చెప్పడం
మోసం చేయడమే అని, ప్రపంచానికి వ్యవసాయం నేర్పింది తానే చంద్రబాబు అన్నట్లు
వ్యవహరించడం హాస్యాస్పదమన్నారు.  ప్రపంచస్దాయి
రాజధాని అమరావతి అంటున్న చంద్రబాబు అమరావతిలో కనీసం రైల్వేస్టేషన్‌ ,బస్‌ స్టేషన్‌ ఉన్నాయా? అన్న విషయాన్ని చెప్పాలని బుగ్గన డిమాండ్ చేశారు. Back to Top