బాబు చెప్పేవన్నీ అబద్ధాలే

నరసరావుపేట: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలు, మోసాలేనని, ఆ మాటలు నమ్మి ఎవరూ మోసపోవద్దని వైయస్‌ఆర్‌ సీపీ నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్‌  గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. హోదా కోసం ఎంఆర్‌పీఎస్‌ ఆధ్వర్యంలో చేపట్టిన అర్ధనగ్న ర్యాలీకి గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మద్దతుగా నిలిచారు. నరసరావుపేట పట్టణంలోని అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే ఎంఆర్‌పీఎస్‌ నేతలతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ  రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నా ప్రత్యేక హోదా అవసరమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం ప్రజాసంఘాలు, రాష్ట్ర రాజకీయ పార్టీలు కలిసికట్టుగా ఉద్యమాలు చేయాలని సూచించారు. హోదా ఇస్తామని ఓట్ల దండుకున్న బీజేపీ, టీడీపీలను నిలదీయాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు. హోదాను కాలరాసే అధికారం ఎవరికీ లేదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి హోదా సాధించేవరకు పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. ఏపీ ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటాలతోనే హోదా సాధ్యమవుతోందన్నారు.

Back to Top