రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ  

కూట‌మి స‌ర్కార్ తీరుపై మాజీ మంత్రి శైలజానాథ్ ఆగ్ర‌హం

అనంతపురం: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ పీఏసీ మెంబ‌ర్‌, మాజీ మంత్రి శైల‌జానాథ్ మండిప‌డ్డారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ..`మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పర్యటన లను అడ్డుకునే కుట్ర జరుగుతోంది . వైయ‌స్‌ జగన్ సత్తెనపల్లి వెళితే చంద్రబాబు సర్కార్ కు ఉన్న ఇబ్బందులు ఏంటి?. బాధిత కుటుంబాన్ని పరామర్శించే హక్కు వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి కి ఉంది. స్వచ్ఛందంగా తరలివచ్చే ప్రజలను నియంత్రించాల్సిన బాధ్యత మీదే. పొదిలి లో వైయ‌స్ జగన్ కు వచ్చిన జన స్పందన చూసి టీడీపీ కూటమి ప్రభుత్వం భయపడుతోంది. చంద్రబాబు సర్కార్ బ్రిటీష్ చట్టాలను అమలు చేసి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ని అణచివేయాలని చూస్తోంది. 30 యాక్ట్ పేరుతో వైయ‌స్ఆర్‌ సీపీ నేతల పర్యటనలను పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గం. శాంతియుత నిరసనలు, సమావేశాలకు భారత రాజ్యాంగం అనుమతి ఇచ్చింది. దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. కేసులు పెడతాం, పెట్టిస్తాం అంటూ పోలీసులు బెదిరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం` అని మాజీ మంత్రి శైలజానాథ్ మండిప‌డ్డారు.

Back to Top